ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న పాపులర్ షో ‘ది బిగ్‌బ్యాంగ్ థియరీ’ వివాదాల్లో చిక్కుకుంది. రెండో సీజన్ తొలి ఎపిసోడ్లో బాలీవుడ్ సీనియర్ నటి మాధురిదీక్షిత్ను కించపరిచేలా అసభ్యపదజాలంతో డైలాగ్ ఉందని రచయిత, రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్‌కుమార్ నెట్‌ఫ్లిక్స్‌కు లీగల్ నోటీసులు పంపించారు. తన నోటీసులపై నెట్‌ఫ్లిక్స్ స్పందించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.