ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి కరోనా సోకినట్లు సమాచారం. ఆస్కార్ అవార్డు గెలిచిన తర్వాత ఇండియాకు వచ్చి టెస్టు చేయించుకోగా, పాజిటివ్ వచ్చినట్లు ఆయన ఓ జాతీయ మీడియాతో పంచుకున్నారు. 'ప్రయాణం, ఉత్సాహం అన్నీ నన్ను ఆకర్షించాయి. నేను కరోనాతో బాధపడుతున్నాను. మెడిసిన్ తీసుకుంటూ రెస్ట్ తీసుకున్నా' అని చెప్పారని సమాచారం. అయితే, రెండ్రోజుల కింద చరణ్ జన్మదిన వేడుకల్లో కీరవాణి పాల్గొనడం గమనార్హం.