యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ట్రెడిషనల్ లుక్ లో మంత్రముగ్ధులను చేస్తోంది. బ్యూటీఫుల్ ఆభరణాలు ధరించిన కుర్ర హీరోయిన్ రెట్టింపు అందాన్ని సొంతం చేసుకుంది. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా అనుపమా పరమేశ్వర్ దూసుకుపోతోంది. వరుస ఆఫర్లను అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు తన ఖాతాలో వరుసగా హిట్లను జమ చేసుకుంటోంది. గతేడాది ‘కార్తీకేయ2’, ‘18 పేజెస్’ చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే.సినిమా అప్డేట్స్ అందిస్తూనే మరోవైపు అదిరిపోయే ఫొటోషూట్లతో అందాల విందు చేస్తోంది. ఇటీవల రెచ్చిపోయి స్కిన్ షో చేస్తోంది. రకరకాలుగా పోజులిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యంగ్ బ్యూటీ స్టన్నింగ్ పోజులకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసి ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేసింది. ఆకర్షణీయమైన ఆభరణాలను ధరించిన అనుపమా రాయల్ లుక్ ను సొంతం చేసుకుంది. అందుకు సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.