2008లో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రానికి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ప్రముఖ కవి, బాలీవుడ్ గీత రచయిత మరియు చిత్రనిర్మాత గుల్జార్ బాలీవుడ్ నటులు గుల్షన్ దేవయ్య మరియు సయామీ ఖేర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న '8 AM మెట్రో' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ చిత్రానికి రాజ్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా ఉండనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. కౌసర్ మునీర్ సాహిత్యం అందించగా, మార్క్ K. రాబిన్ సంగీతం అందించారు. షిలాదిత్య బోరా యొక్క ప్లాటూన్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ద్వారా భారతదేశం అంతటా సినిమా థియేటర్లలో మే 19న ఈ చిత్రం విడుదల కానుంది.