సీనియర్ నటుడు శరత్ బాబు గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇందుకోసం బెంగళూరులో చికిత్స పొందుతున్నాడు. అయితే శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు.వెంటనే చికిత్స అందించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.