సాయి ధరమ్‌తేజ్-సంయుక్త మీనన్ జంటగా నటించిన ‘విరూపాక్ష’ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. యూఎస్‌లో తొలిరోజు 2 లక్షల డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసిన ఈ సినిమా రెండో రోజు హాఫ్ మిలియన్ డాలర్స్‌ని టచ్ చేసిందనే చెప్పాలి. యుఎస్ + కెనడాలో ఈ చిత్రానికి ప్రీమియర్ డే 1 వసూళ్లు రెండవ రోజు అత్యధికంగా వచ్చాయి. దీంతో ఈ సినిమా ఏ రేంజ్లో హిట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆదివారం వసూళ్లతో 7 నుంచి 8 లక్షల డాలర్ల మార్కును ఈజీగా క్రాస్ చేసి 1 మిలియన్ మార్క్ ని ఈజీగా క్రాస్ చేస్తుందనడంలో సందేహం లేదు.