ప్రముఖ సింగర్ సునీత భర్త వీరపనేని రామకృష్ణ పోలీసులను ఆశ్రయించారు. కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి సినీ నిర్మాతల సభ్యుడినని తరచూ పోన్లు చేస్తున్నాడని, అర్జెంటుగా మాట్లాడాలని పిలుస్తున్నాడని ఫిర్యాదు చేశారు. అతని నెంబర్ బ్లాక్ చేసినా కొత్త నెంబర్ నుండి ఫోన్లు చేస్తున్నాడని తెలిపారు. తనకు, తన కుటుంబ సభ్యులకు అతని నుండి ప్రాణహాని ఉందని, అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.