హీరోయిన్ పూజా హెగ్డే తన బ్యూటీ సీక్రెట్స్ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. తన మేని ఛాయ, ఆరోగ్యం వెనకున్న కారణాలు బహిర్గతం చేశారు. హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. అది ఉన్నంత కాలమే కెరీర్. అందుకే ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా సౌందర్యం కోసం సమయం కేటాయిస్తారు. మంచి ఆహారం, వ్యాయామం, బ్యూటీ టిప్స్ ఫాలో అవుతారు. బుట్ట బొమ్మ పూజా హెగ్డే గ్లామర్ పొందేందుకు ప్రత్యేకంగా కొన్ని టిప్స్ ఫాలో అవుతున్నారు. అవి అభిమానులతో పంచుకున్నారు. హీరోయిన్స్ అంటే మేకప్ తప్పనిసరి. శరీరం మీద రసాయనాల ప్రభావం ఉంటుంది. అందుకే సహజమైన ఫేస్ ఫ్యాక్స్ వేసుకుంటుందట. పసుపు, పాల మీగడ కలిసి ముఖానికి ప్యాక్ లా పెట్టుకుంటారట. కొద్ది నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకుంటారట. దాంతో ముఖం తాజాగా తయారవుతుందట. రోజూ ఓ టీ స్పూన్ నెయ్యి తింటుందట. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే కూరగాయలు, పాలు, పాల పదార్థాలు ఆహారంగా తీసుకుంటారట. పూజా హెగ్డేకు ఎగ్జిమా సమస్య ఉందట. ఆ కారణంగా శరీరం పొడిబారిపోతూ ఉంటుందట. అందుకే నిద్ర లేవగానే ముఖం శుభ్రంగా కడుక్కుని మాయిశ్చరైజర్ రాసుకుంటారట. నీళ్లు ఎక్కువగా తాగుతారట. నీటి శాతం అధికంగా ఉండే పళ్ళు, కూరగాయలు తింటారట. ఎండలో ట్యాన్ కాకుండా సన్ స్క్రీన్ రాసుకుంటారట.