మంచి కంటెంట్ దొరికితే వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధమేనని మెగాస్టార్ చిరంజీవి గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల మెగాస్టార్‌కు వచ్చిన ఓ భారీ ఓటీటీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సీనియర్ హీరో వెంకటేష్ చేసిన వెబ్ సిరీస్ సినిమాకు నార్త్ ఇండియాలో వ్యూస్ బాగా వచ్చినా, తెలుగు ఆడియన్స్ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్‌లపై చిరంజీవి వెనకడుగు వేసినట్లే కనిపిస్తోంది.