టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకతంలో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రానికి తాత్కాలికంగా 'OG' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ పెట్టారు. ఇటీవల విడుదలైన వీడియో గ్లింప్స్ మరియు ఆన్-స్పాట్ చిత్రాల విడుదలతో ఈ సినిమాపై అంచనాలు ఊపందుకున్నాయి.
తాజాగా ఇప్పుడు, ఈ సినిమా బొంబాయిలో పవర్-ప్యాక్డ్ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ షెడ్యూల్లో ప్రకాష్‌రాజ్, పవన్‌కల్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్‌లపై ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ బిగ్గీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.