ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'118' చిత్రం యొక్క ట్రైలర్ ను వచ్చే వారంలో విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 10, 2019, 01:47 PM

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘118’ ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈచిత్రం నుండి తాజాగా విడుదలైన ‘చందమామే’ అనే సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను వచ్చే వారంలో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ శాలిని పాండే , నివేత థామస్ కథానాయికలుగా నటిస్తుండగా శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

‘దూకుడు’ సినిమాటోగ్రఫర్ కెవి గుహన్ ఈ చిత్రాన్నీ తెరకెక్కిస్తున్నారు. ఆయనకు దర్శకుడిగా ఇదే మొదటి చిత్రం. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa