నూతన దర్శకుడు పవన్ బసంశెట్టి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'రంగబలి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో యుక్తి తరేజా ప్రధాన పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా నుండి మన ఊరిలో మనల్ని ఎవడ్రా అపేది అనే టైటిల్ తో ఫస్ట్ సింగిల్ మే 24, 2023న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రం జూలై 7, 2023న థియేటర్లలోకి రానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి పవన్ సిహెచ్ సంగీతం అందించారు.