గోపీచంద్, డింపుల్ హయాతీ జంటగా తెరకెక్కిన రామబాణం సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ రిలీజ్‌కు ముందే ఏకంగా రూ.8 కోట్లకు దక్కించుకుంది. ఈ సినిమాను జూన్ 3 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.