స్టార్‌హీరోయిన్ కీర్తి సురేశ్ డేటింగ్‌లో ఉందంటూ ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. త్వరలో వీరిద్దరూ ఏడడుగులు వేయబోతున్నారంటూ ఓ అబ్బాయితో కీర్తి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై తాజాగా కీర్తి సురేశ్ తండ్రి క్లారిటీ ఇచ్చారు. కీర్తితో ఉన్న వ్యక్తి వారి ఫ్యామిలీ ఫ్రెండ్ అని, ఓ ఫంక్షన్‌లో తీసిన ఫోటోలను తమిళ మ్యాగజైన్ సేకరించి ఇలా పెళ్లి ఫిక్స్ అయిందంటూ వార్తలు సృష్టించారని చెప్పుకొచ్చారు.