ఉప్పెనతో మూవీతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కృతి శెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు క్యూకట్టాయి. అయితే అదే టెంపోను మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. ఉప్పెన తరువాత నటించిన శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాలు కూడా కృతి శెట్టికి మంచిపేరునే తీసుకువచ్చాయి. దీంతో ఈ బ్యూటీని గోల్డెన్ లెగ్ అని పొగిడారు.అయితే ఆ తరువాత కథ అడ్డం తిరిగింది. ఏ సినిమా చేసినా.. ప్రేక్షకులను మాత్రం అస్సలు మెప్పించడం లేదు. దీంతో బేబమ్మ జోరుకు కాస్త బ్రేక్‌లు పడ్డాయి. మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో అలరిస్తోంది. చీరకట్టులో గ్లామర్ మెరుపులతో అందాలు ఆరబోస్తుంది. తాజాగా వైట్ ప్రింటెడ్ శారీలో ఫోటోలకు పోజులిచ్చింది. కవ్వించే నడుము అందాలతో హీటు పుట్టిస్తోంది.
చీరలో కీర్తి శెట్టి లుక్ !#KrithiShetty pic.twitter.com/bbbYnTJDV2
— VD bulletin (@vdbulletin) June 1, 2023