ప్రముఖ టాలీవుడ్ నటి మాధవీలత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తక్కువ సినిమాల్లోనే నటించినా ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ నటికి సోషల్ మీడియా లో కూడా క్రేజ్ పెరుగుతోంది.తాజాగా ఈ నటి పెళ్లి గురించి, ఇతర ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే వయస్సు మాత్రమే సరిపోదని మాధవీలత అన్నారు. ఆ అమ్మాయి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలని మాధవీలత పేర్కొన్నారు. పెళ్లి చేసుకోవడం అనేది అమ్మాయి వ్యక్తిగత నిర్ణయం అని ఆమె కామెంట్లు చేశారు. ప్రస్తుతం నేను పెళ్లికి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా లేనని ఆమె చెప్పుకొచ్చారు. భవిష్యత్తుపై నాకు నమ్మకం లేదని మాధవీలత చెప్పుకొచ్చారు. ఇది నా నిర్ణయం అని ఇది నా జీవితం అని ఆమె కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయనే సంగతి తెలిసిందే. తాను మైగ్రేన్ సమస్యతో బాధ పడుతున్నానని మాధవీలత వెల్లడించారు. మాధవీలత చేసిన పోస్ట్ కు 1500 కంటే ఎక్కువగా లైక్స్ వచ్చాయి. పెళ్లి గురించి సొసైటీ నుంచి పదేపదే ప్రశ్నలు ఎదురవుతూ ఉండటంతో మాధవీలత ఈ తరహా పోస్ట్ ను పెట్టారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మాధవీలత పోస్ట్ గురించి కొంతమంది పాజిటివ్ గా కామెంట్లు చేస్తుండగా మరి కొందరు నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. నచ్చావులే సినిమాతో మాధవీలత టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారనే సంగతి తెలిసిందే. స్నేహితుడా, అరవింద్2 సినిమాలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. మాధవీలత ఎంతో కష్టపడినా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోలేదు. మాధవీలత వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అయితే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు.