నరేశ్ – పవిత్రా లోకేష్ ల జంట ఇప్పుడు టాలీవుడ్ ట్రెండింగ్ గా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉండగా, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇక తాజాగా పవిత్ర విషయంలో నరేశ్ చేసిన ఓ పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పవిత్రకు తన మాతృభాష అయిన కన్నడలో పీహెచ్ డీ చేయాలని కోరిక. అందుకోసం ఆమె ఎంట్రన్స్ రాయడానికి బళ్లారి వెళ్లగా, నరేశ్ కూడా వెళ్లి ఆమెతో పరీక్షలు రాయించారు.