సీనియర్ నటి, కర్ణాటక ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్ వివాహం ఘనంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిదపా కుమార్తె అవివాతో ఆయన పెళ్లి జరిగింది.బెంగళూరులోని ఓ ప్రముఖ ప్యాలెస్ వీరి వివాహానికి వేదికైంది. సోమవారం ఉదయం జరిగిన ఈ పెళ్లి వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రజనీకాంత్, మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. వీటిని చూసిన నెటిజన్లు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.చిన్న వయసులోనే నటిగా అడుగుపెట్టిన సుమలత.. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ పరిశ్రమల్లో నటించింది. ఈ క్రమంలోనే కన్నడ నటుడు అంబరీశ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. అంబరీశ్ మరణం తర్వాత ఆమె ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.