వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ శుక్రవారం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, తల్లి అంజనాదేవి, అల్లు అరవింద్-నిర్మల, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్ భార్య స్నేహ, అల్లు బాబీ, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ హాజరయ్యారు. ఫొటోలను వరుణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.