నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'భగవంత్ కేసరి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నేడు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో 'నేలకొండ భగవంత్ కేసరి.. ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది' అనే మాస్ డైలాగ్ తో బాలయ్య ఆకట్టుకున్నారు. ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.
వీటితో పాటుగా బాలయ్య పై యాక్షన్ సీక్వెన్స్ లు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండగా మరో బిగ్గెస్ట్ హైలైట్ ఏదన్నా ఉంది అంటే అది థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. థమన్ బాలయ్య కి లాస్ట్ టైం ఇచ్చిన రెండు సినిమాలు తరహాలో సాలిడ్ వర్క్ అయితే ఈ చిత్రానికీ అందించినట్టుగా ఈ టీజర్ చూస్తే అర్ధం అయిపోతుంది.