మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం శుక్రవారం వైభవంగా జరిగింది. అయితే, ఇప్పుడు వీరి పెళ్లి ఎప్పుడు, ఎక్కడనేది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఇటీవల సినీ సెలబ్రిటీలు డెస్టినేషన్ మ్యారేజ్ లే చేసుకుంటున్న క్రమంలో వీరు కూడా డెస్టినేషన్ స్పాట్ లోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. సెంటిమెంట్ ప్రకారం ఇటలీలోని ఓ ప్రముఖ ప్యాలెస్ లో ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో వీరి పెళ్లి ఉంటుందని టాక్ వినిపిస్తోంది.