ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన తదుపరి పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'స్పై' అనే టైటిల్ ని లాక్ చేసారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో జూన్ 29, 2033న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ పాన్-ఇండియన్ గూఢచర్య థ్రిల్లర్ సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా జరుగుతుండడంతో సినిమాను వాయిదా వేసే యోచనలో మూవీ మేకర్స్ ఉన్నట్లు తాజా గాసిప్ వినిపిస్తోంది. అయితే మూవీ టీమ్ నుంచి ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ లో నిఖిల్ సరసన ఈశ్వర్యా మీనన్ జోడిగా నటిస్తోంది. సన్యా ఠాకూర్, ఆర్యన్ రాజేష్ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను అందించారు. ఎడ్ ఎంట్రయిన్మెంట్స్పై కె రాజ శేఖర్ రెడ్డి ఈ పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు.