టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమతం మరియు వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రలు పోషించిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా రి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి, అనీషా ఆంబ్రోస్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ బడ్డీ కామెడీ చిత్రంలో టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అతిధి పాత్రలో కనిపించారు.
తరుణ్ భాస్కర్ ఇటీవల తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ సూపర్‌హిట్ మూవీ యొక్క 5వ వార్షికోత్సవం సందర్భంగా జూన్ 29, 2023న థియేటర్లలో మళ్లీ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం వివేక్ సాగర్ సంగీతం అందించారు.