ప్రముఖ టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠిలకు ఇటీవల ఎంగేజ్మెంట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే త్వరలోనే పెళ్లికూతురు కాబోతున్న లావణ్య త్రిపాఠికి సంబంధించిన పెళ్లి కాస్ట్యూమ్స్ పై క్రేజీ రూమర్ నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కోసం ధరించిన సారీ.. రింగ్స్.. కాస్ట్ డీటెయిల్స్ వైరల్ అవ్వగా తాజాగా లావణ్య త్రిపాఠి పెళ్లిలో కట్టుకోబోయే చీర కోసం దాదాపు 40 -50 లక్షలు రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు కేవలం తాళి కట్టే టైంలో కట్టుకున్న చీర కోసమే ఇంతఖర్చు చేస్తున్నారు.