భారత క్రికెటర్ ఎంఎస్ ధోని కోలీవుడ్‌లో ధోనీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో తన తొలి నిర్మాణాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. డైరెక్టర్ రమేష్ తమిళమణి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి 'LGM' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. తక్కువ వ్యవధిలో 7 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ సినిమా ఇందులో హరీష్ కళ్యాణ్ మరియు ఇవానా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నదియా, యోగిబాబు, మిర్చి విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయడానికి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈ కామెడీ ఫ్యామిలీ డ్రామాకి దర్శకుడు రమేష్ తమిళమణి స్వయంగా సంగీతం అందిస్తున్నారు. ధోనీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాక్షి ధోని ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను నిర్మిస్తున్నారు.