తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్‌ను నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'జైలర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ యాక్షన్ డ్రామా యొక్క ఓవర్సీస్ హక్కులను ఐంగారన్ ఇంటర్నేషనల్ సుమారు 32 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, సునీల్, తమన్నా భాటియా, జాకీ ష్రాఫ్, మరియు రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జైలర్ సినిమా ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందిస్తున్నారు.