లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లియో’. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల ‘నా రెడీ’ సాంగ్ విడుదలైంది. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఈ సాంగ్ మేకర్స్‌ను చిక్కుల్లోకి నెట్టింది. ఈ పాటలో మత్తు పదార్థాలు వాడారని, రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించారంటూ చెన్నైలోని కొరుక్కుపెట్టై ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త ఆర్టీఐ సెల్వం కోర్టును ఆశ్రయించాడు. నార్కోటిక్ కంట్రోల్ యాక్ట్ కింద చిత్రబృందంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు.