కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తదుపరి యాక్షన్ ఎంటర్టైనర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'లియో' మూవీ చేస్తున్నాడు.ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19, 2023న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా తలపతి విజయ్‌పై నార్కోటిక్స్ నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఇటీవలే 'నా రెడీ' అనే పాటని రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ మొదటి సింగిల్‌కి ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. ఈ పాటను తలపతి విజయ్ పాడగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. అయితే ఈ పాటలో మత్తు పదార్థాల వినియోగం, రౌడీయిజం కనిపిస్తోందని పేర్కొంటూ చెన్నైలోని ఓ ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త సెల్వ ఆర్టీఐ కోర్టును ఆశ్రయించారు. జూన్ 25న ఆన్లైన్లో తన పిటిషన్‌ను సమర్పించగా, జూన్ 26న తన వ్యాజ్యాన్ని దాఖలు చేశాడు.