ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన తదుపరి పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'స్పై' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవలే లాంచ్ చేసిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది.
లేటెస్ట్ న్యూస్ ప్రకారం, ఈ పాన్-ఇండియన్ గూఢచర్య థ్రిల్లర్ సినిమా యొక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఈరోజు హైదరాబాద్‌లోని వెస్టిన్ హోటల్లో సాయంత్రం 6:30 నుండి గ్రాండ్ గా నిర్వహించాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేసారు. ఈ వేడుకకు కస్టడీ యాక్టర్ అక్కినేని నాగ చైతన్య చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ఆన్లైన్లో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.
ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ లో నిఖిల్ సరసన ఈశ్వర్యా మీనన్ జోడిగా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో జూన్ 29, 2033న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సన్యా ఠాకూర్, ఆర్యన్ రాజేష్ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను అందించారు. ఎడ్ ఎంట్రయిన్‌మెంట్స్‌పై కె రాజ శేఖర్ రెడ్డి ఈ పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు.