పెళ్లిచేసుకున్నాక తాను సినిమాల్లో ముద్దు సీన్లలో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు ఢీ ఫేమ్, హీరోయిన్ ప్రియమణి తెలిపారు. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. 'ముద్దు సీన్లలో నటిస్తే నా భర్తకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఇలాంటి సీన్ లో నటించలేదు. సినిమా అగ్రిమెంట్ ముందే దర్శక, నిర్మాతలకు క్లియర్ గా చెబుతాను. నా మూవీస్ వల్ల నా ఫ్యామిలి ఇబ్బంది పడొద్దు" అని చెప్పుకొచ్చింది.