హలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా వుంది. అందులో భాగంగా తెలుగులో చిత్రలహరి , శర్వానంద్ నటిస్తున్న గ్యాంగ్ స్టార్ డ్రామాలో నటిస్తుండగా మళయాలంలో మరో రెండు చిత్రాలు చేస్తుంది. ఇక ఈ బ్యూటీ కి ఇప్పుడు తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ సరసన నటించే అవకాశం వచ్చినట్లు టాక్.
అభిమన్యుడు ఫేమ్ మిత్రన్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ తన 15వ చిత్రంలో నటించాల్సి వుంది. ఈ సినిమాకు కళ్యాణి ని హీరోయిన్ గా తీసుకోనున్నారట. త్వరలోనే దీనిపై అధికారికాప్రకటన రానుంది. మార్చి నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక తాజాగా ‘మిస్టర్ లోకల్’ సినిమాని పూర్తి చేసిన శివ కార్తికేయన్ ప్రస్తుతం తన 14వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయనకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa