మలయాళ బ్యూటీ అనుమప పరమేశ్వరన్ తన బాధను వ్యక్తపరిచారు. ప్రేమమ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. కార్తికేయ, 18 పేజెస్ సినిమాతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో హీరోయిన్గా నాకే ఛాన్స్ వచ్చింది. అప్పుడా సినిమాను చేతులారా వదులుకున్నాను. ఆ సినిమా నా కెరీర్లో గుర్తుండిపోయే మూవీ అయ్యేది. అది గుర్తుకు వచ్చినప్పుడల్లా చాలా బాధేస్తుంది.’ అని చెప్పుకొచ్చారు.