స్టార్ హీరోయిన్గా ఎదిగిన సదా వయసు పెరిగిపోతున్నా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసింది. పెళ్లి చేసుకునే వ్యక్తి అర్థం చేసుకునే వాడు కావచ్చు, కాకపోవచ్చు, పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛను కోల్పోతామని చెప్పింది. ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడటం లేదని, చిన్నచిన్న కారణాలకే భార్యాభర్తలు విడిపోతున్నారని, అందుకే తనకు పెళ్లిపై ఆసక్తి లేదని చెప్పింది.