ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వంలో శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీని డైరెక్టర్ ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఇంటర్వెల్ వరకు సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. కానీ సెకండాఫ్ స్లోగా సాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రేమ వ్యవహారాలను దృష్టిలో పెట్టుకుని సినిమా తీసినట్లు ఉంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి నటన, సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.