అఖిల్‌తో సినిమా చేయడం తన కర్మ అని నిర్మాత రామ్ అచంటా ఆరోపించారు. ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదలైన ‘ఏజెంట్’ మూవీ డిజాస్టర్‌గా మిగిలింది. రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన తర్వాత రూ.7 కోట్లు మార్కెట్ చేసింది. రామ్ అచంటా నిర్మాణంలో ఇటీవల విడుదల ‘సామజవరగమన’ మంచి హిట్ అందుకుంది. సినిమా సక్సెస్ మీట్లో నిర్మాత మాట్లాడుతూ.. ఏజెంట్ సినిమాతో దారుణంగా నష్టపోయానని అన్నారు. తన జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు అదేనని అన్నారు.