బాలీవుడ్ నటి పూజాభట్కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. వివరాల్లోకి వెళ్తే.. నీలగిరి జిల్లా జెగదల గ్రామంలో ఆమె అసైన్డ్ భూమిని కొన్నారు. ఆ భూమిని ఎం.కుప్పన్ అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయించింది.
కాలక్రమంలో ఆ భూమి పలువురి చేతులు మారింది. ఆ భూమి కొనుగోలు చెల్లదని, ప్రభుత్వానికి ఆ భూమిని అప్పగించాలని కొత్తగిరి తహసీల్దార్ ఆదేశించారు. దాంతో పూజాభట్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పూజాభట్ పిటిషన్ను కొట్టివేసింది.