ఓ బ్రాండ్ ప్రమోషనల్ షూట్ లో పాల్గొన్న దిశా పటాని లుక్ వైరల్ అవుతుంది. రెచ్చగొట్టే పోజుల్లో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దిశా దెబ్బకు నెటిజెన్స్ దిశలు తిరుగుతున్నాయి. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దిశ టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లోఫర్ మూవీతో ఆమెను హీరోయిన్ చేశారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ అనుకున్నంత విజయం సాధించలేదు. ఇక తెలుగులో ఆమెకు ఆఫర్స్ రాకున్నా బాలీవుడ్ లో నిలదొక్కున్నారు. ఎంఎస్ ధోని, భాగీ 2, భరత్ చిత్రాలు ఆమెకు బ్రేక్ ఇచ్చాయి. అయితే సల్మాన్ ఖాన్ తో చేసిన రెండో చిత్రం రాధే అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రభుదేవా దర్శకత్వంలో విడుదలైన రాధే అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రం చేస్తున్నారు. కాగా ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కె లో దిశ నటిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో దిశ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం.
#CalvinKlein pic.twitter.com/POz3QiXP1Z
— Disha Patani (@DishPatani) July 14, 2023