సౌత్ స్టార్ హీరో విజయ్ ఆంటోని అద్భుతమైన స్క్రిప్ట్‌లతో సినిమా ప్రేమికులని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తుంటాడు. బాలాజీ కుమార్ దర్శకత్వంలో ఈ స్టార్ హీరో ఇప్పుడు తాజాగా 'హత్య' అనే కొత్త సినిమాతో ఆడియన్స్ ని అలరించటానికి సిద్ధం అవుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం, ప్రతిష్టాత్మకమైన సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఏషియన్ సినిమాస్ హత్య థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. జులై 21న తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో విజయ్ డిటెక్టివ్‌గా కనిపించనున్నాడు అని సమాచారం. విజయ్ ఆంటోనీ సరసన ఈ మూవీలో గ్లామర్ క్వీన్ రితికా సింగ్ సంధ్య అనే రూకీ పోలీసుగా నటించింది. జాన్ విజయ్,రాధికా శరత్‌కుమార్, మురళీ శర్మ, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోహ్రా కీలక పత్రాలు పోషిస్తున్నారు. కమల్ బోహ్రా, జి. ధనంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోహ్రా అండ్ ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్‌పై ఎస్ విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ శంకర్‌లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.