కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కొత్త యాక్షన్ ప్యాక్ షెడ్యూల్ ని పూర్తి చేసినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లో సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో భారీ యాక్షన్ బ్లాక్ ని చిత్రీకరించారని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.
ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.