టాలీవుడ్‌కి చెందిన మరో హీరోయిన్ తన భర్త నుంచి విడాకులు తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అష్టాచమ్మా, కార్తికేయ, త్రిపుర, స్వామిరారా వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి కలర్స్ స్వాతి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె తన ఇన్‌స్టా ఖాతా నుంచి తన భర్త వికాస్ వాసు ఫోటోను తొలగించింది. దీంతో ఆమె విడాకులు తీసుకోబోతోందని ప్రచారం సాగుతోంది. మరి ఈ పుకార్లపై ఆమె ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.