బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో దర్శనమిచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దుమ్ములేపడంతో పాటు ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్’ అవార్డును కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అలియాకు దేశ వ్యాప్తంగా మరింతగా క్రేజ్ దక్కించుకుంది. నార్త్ లో ఇప్పటికే నాటుకుపోయిన ఈ స్టార్ భామ RRRతో ఇటు దక్షిణాది ఆడియెన్స్ లోనూ మంచి క్రేజ్ దక్కించుకుంది. తొలిచిత్రంతోనే భారీ బ్లాక్ బాస్టర్ అందుకున్న హీరోయిన్ గా నిలిచింది. ఇదిలా ఉంటే.. గతేడాది బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ తో అలియా వివాహం గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో హిందూ సంప్రదాయ పద్ధతుల్లో వీరి పెళ్లి వేడుకగా అంగరంగ వైభవంగా జరిగింది. అదే ఏడాది చివరల్లో పండంటి ఆడబిడ్డకు కూడా జన్మిచ్చి తల్లిగా ప్రమోషన్ పొందింది.తాజాగా స్కై బ్లూ కలర్ శారీలో మెరిసింది. చీరకట్టులో తెలుగు అమ్మాయిలా కనువిందు చేసింది. అదిరిపోయే స్టిల్స్ ఇస్తూ ఆకట్టుకుంది. మరోవైపు స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి గ్లామర్ మెరుపులు మెరిపించింది. కొంటె పోజులతో చూపుతిప్పుకోకుండా చేసింది. మత్తు చూపులతో మైమరిపించింది. దీంతో ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
#AliaBhatt pic.twitter.com/VCZWOoYmPI
— VD bulletin (@vdbulletin) July 19, 2023