బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి బెయిల్‌పై ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్‌పై చర్చలు జరిగాయి. రియాకు మంజూరైన బెయిల్‌ను సవాలు చేయడం లేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒక రకంగా ఇది రియా చక్రవర్తికి ఊరట తెప్పించే విషయమని ఆమె తరఫు న్యాయవాదులు చెబుతున్నారు.