పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా పరిచయమైన శ్రీలీలకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా శ్రీలీల చేతిలో అరడజను ప్రాజెక్టులున్నాయి. అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయితేనే కొత్త సినిమాలు చేయగలనని, కాకపోతే రెండుకోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వాలని ఈ భామ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కోటి రూపాయల్లోపు పారితోషికాన్ని అందుకుంటున్న శ్రీలీల ఏకంగా రూ.2 కోట్లు అడగడం చర్చనీయాంశంగా మారింది.