బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన ఫ్యాషన్ సెన్స్ తో కట్టిపడేస్తోంది. తాజాగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లో చీరకట్టులో దర్శనమిచ్చింది. రాయల్ లుక్ లో మెరిసిపోతూ చూపుతిప్పుకోకుండా చేసింది.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. దక్షిణాదిలో పెద్దగా సినిమాలు చేయకున్నా ఈ ముద్దుగుమ్మకు ఇక్కడా క్రేజ్ ఉంది. ఇక త్వరలో ‘కల్కి : 2898 ఏడీ’తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతోంది. ప్రభాస్ సరసన నటిస్తున్న ఈ చిత్రం పాన్ వరల్డ్ మూవీగా రాబోతోంది.ఇదిలా ఉంటే.. దీపికా పదుకొణె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా కనిపిస్తారో తెలిసిందే. ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ సొట్టబుగ్గల సుందరి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఈక్రమంలో దీపికా ఏ పోస్టు పెట్టినా నెట్టింట క్షణాల్లోనే వైరల్ గా మారుతుంటుంది.ఇక తాజాగా దీపికా బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిన్న ముంబైలో గ్రాండ్ బ్రైడల్ కోచర్ షోను నిర్వహించారు. ఇది స్టార్-స్టడెడ్ ఈవెంట్. ఇందులో ప్రధాన ఆకర్షణ రణవీర్ సింగ్, అలియా భట్ షోస్టాపర్లుగా ఉన్నారు. ఇదే ఈవెంట్ లో దీపికా పదుకొణె కూడా మెరిసింది.
Deepika Padukone is the ultimate benchmark of traditionals!!!!#DeepikaPadukone #ManishMalhotraCouture pic.twitter.com/J5aXNFIp3I
— VD bulletin (@vdbulletin) July 21, 2023