మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత నెల 9న నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇరు కుటుంబీకులు వరుణ్-లావణ్య పెళ్లి ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సమాచారం మేరకు వచ్చే నెల ఆగస్టు 24వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివాహం ఇటలీలో ఘనంగా జరగనుందని తెలుస్తోంది. పెళ్లికి నెల రోజులు మాత్రమే ఉండటంతో కొత్త జంట షాపింగ్ కోసం విదేశాలకు వెళ్లినట్లు సమాచారం.