ఇటీవల అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ హీరోయిన్ మౌనీరాయ్ తన ఆరోగ్య పరిస్థితిని తెలుపుతూ సోషల్మీడియాలో చేసిన పోస్టు వైరలవుతోంది.‘‘9 రోజులు ఆసుపత్రిలో ఉన్న తర్వాత ఈరోజే ఇంటికి వచ్చాను. అక్కడ ఉన్నని రోజులు ఎంతో బాధ అనుభవించాను.ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగా ఉంది.ఇన్ని రోజులు నన్నెంతో జాగ్రత్తగా చూసుకోవడానికి వాళ్ల అమూల్యమైన సమయాన్ని కేటాయించిన ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు’’అని రాసుకొచ్చింది.