ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ రెడ్డి బయోపిక్‌ రెడీ..

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 23, 2019, 09:41 PM

నిజం చెప్పాలంటే కళలకు సరిహద్దులు ఉండవు.. అంద‌ర్నీ ఒక్క‌టి చేసేది ఈ క‌ళ‌లే.. రాజకీయాలకు, సరిహద్దులకు అతీతమైనవి కళలనేవి అని చెప్పింది విద్యాబాల‌న్. ఇక ఈ క‌ళ‌ల్లో కేవ‌లం న‌ట‌న మాత్ర‌మే కాదు.. ఇంకా చాలా ఉంటాయ‌ని.. సంగీతం, సినిమా, నాట్యం, నాటకాలు, ర‌చ‌న అన్నీ ఇందులోకే వ‌స్తాయ‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌.
ఇవ‌న్నీ ప్రాంతం, దేశంతో ప‌ని లేకుండా ప్రజలకు చేరువ చేస్తాయ‌ని కామెంట్ చేసింది విద్యాబాలన్. అయితే కొన్ని సార్లు క‌ళ‌ల కంటే కూడా దేశం గొప్ప‌ద‌నేది గుర్తు పెట్టుకోవాలి. ఎంత క‌ళ అయినా కూడా దేశం త‌ర్వాతే కాబ‌ట్టి కొన్నిసార్లు మ‌న భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలను తీసుకోక తప్పదని చెప్పింది ఈ భామ‌. పాకిస్తానీ న‌టుల‌ను నిషేధించ‌డం కాస్త బాధ క‌లిగించినా కూడా త‌ప్ప‌దంటుంది విద్యా.
ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్స్ ట్రెండ్ బాగానే న‌డుస్తుంది. ఒక‌ప్పుడు బ‌యోపిక్ చేయాలంటే వాళ్లేదైనా గొప్ప ప‌ని చేసుండాలి.. వాళ్ల జీవితం తెరపై చూపిస్తే న‌లుగురు చూసి మంచి నేర్చుకోవాల‌నే ఉద్దేశ్యం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. బ‌యోపిక్ అర్థాన్నే మార్చేసి క్యాష్ కోసం కావాల్సిన‌ట్లు తీస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఎవ‌రి బ‌యోపిక్ ప‌డితే వాళ్ల‌ది తీస్తున్నారు. ఇప్పుడు ఇదే దారిలో శ్రీ రెడ్డి బ‌యోపిక్ కూడా వ‌స్తుంది. అస‌లు శ్రీ రెడ్డి బ‌యోపిక్ ఏంట‌ని అడుగుతున్నారు ప్రేక్ష‌కులు.
అస‌లు ఈమె జీవితంలో ఏముంది.. న‌డిరోడ్డుపై బ‌ట్ట‌లిప్ప‌డం త‌ప్ప అంటూ సెటైర్లు వేస్తున్నారు. కానీ శ్రీ రెడ్డి మాత్రం త‌న‌కు త‌ను శ్రీ శ‌క్తిగా చెప్పుకుంటుంది. ఇప్పుడు ఈమె జీవితం ఆధారంగా 'రెడ్డి డైరీ' పేరుతో ఓ సినిమా కూడా వ‌స్తుంది. ఆమె పాత్ర‌కు ఎవ‌రూ న్యాయం చేయ‌లేర‌ని.. త‌న పాత్ర‌లో స్వయంగా తానే నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. ఈమెతో పాటు ఇంకొంద‌రు న‌టులు కూడా ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. డాక్టర్ అల్లాదీన్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.
ఇక శ్రీ రెడ్డి బ‌యోపిక్ క‌థ బాధ్త‌య చిత్తిరై సెల్వన్ తీసుకున్నాడు. ఈమె జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య‌మైన సంఘటనలను తీసుకుని ఈ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నారు. ఇండ‌స్ట్రీలో జ‌రిగిన లైంగిక దోపిడి గురించి కూడా ఉంటాయంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ముఖ్యంగా ఉండేదే దాని గురించి అనే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి.
ఇక ఈ చిత్రంలో ద‌గ్గుపాటి వార‌సుడు అభిరామ్ పాత్ర బాగా హైలైట్ చేస్తున్నార‌ని తెలుస్తుంది. ఏకంగా ఫోటోల‌తో పాటు బ‌య‌ట‌పెట్టింది శ్రీ రెడ్డి ఆ మ‌ధ్య‌. సినిమాలో కూడా పేర్లు మార్చి వాళ్ల‌పై సెటైర్లు వేయ‌డానికి సై అంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అలెప్పీ, గోవాలలో జ‌రుగుతుంది. రవి దేవన్ నిర్మిస్తోన్న ఈ సినిమాను స‌మ్మ‌ర్ విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నారు. మ‌రి రెడ్డి డైరీస్ ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర తీస్తుందో చూడాలిక‌.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa