‘బ్రో’ మూవీ డైరెక్టర్ సముద్రఖని టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సముద్రఖని మాట్లాడుతూ.. ‘రామ్ చరణ్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించాను. నన్ను బాబాయ్ అని పిలిచేవాడు. ఆర్ఆర్ఆర్ సినిమా సమయంలో మేము మంచి స్నేహితులమయ్యాం. అల్లు అర్జున్‌తో కలిసి అలా వైకుంఠపురంలో సినిమాలో నటించాను. నేను తనని అన్బు అర్జున్ అని పిలుస్తాను. అన్బు అంటే ప్రేమ అని అర్థం.’ అని అన్నారు.