వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ తమన్నా ఫుల్ బిజీగా ఉంటోంది. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘భోళా శంకర్, జైలర్’ సినిమాలు వచ్చే వారం విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఇంటర్వ్యూలో పాల్గొన తమన్నా పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘18 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణించానంటే సినిమాలపై నాకున్న అంకితభావం, క్రమశిక్షణే కారణం. ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించే తీరిక లేదు. ఒకవేళ పెళ్లి కుదిరితే ఆ విషయాన్ని తప్పకుండా చెప్తాను.’ అని చెప్పారు.