ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. ఆమెకు చెందిన సినిమా థియేటర్ లో పనిచేసిన కార్మికుల నుండి వసూలు చేసిన ESI మొత్తాన్ని చెల్లించలేదని లేబర్ కార్మిక బీమా కార్పొరేషన్ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు జయప్రదతో పాటు మరో ముగ్గురికి జైలుశిక్ష, రూ. 5 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.